నీట్ పేపర్ లీక్ కేసు: సుప్రీంకోర్టు విచారణ జూలై 18కి వాయిదా

నీట్ పేపర్ లీక్  కేసు: సుప్రీంకోర్టు విచారణ జూలై 18కి వాయిదా

NEET UP 2024 పేపర్ లీక్ కేసులో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే గురువారం (జూలై 18, 2024 ) నీట్ యూజీ పేపర్ లీక్ కేసులు విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్ టీఏ ఈ కేసుకు సంబంధించిన అఫిడవిట్ లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం (జూలై 11) న  సుప్రీంకోర్టు లో తన దర్యాప్తు నివేదికను దాఖలు చేసింది. 

అయితే నీట్ ప్రవేశ పరీక్షలో ఎటువంటి సామూహిక మాల్ ప్రాక్టీస్ జరగలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. జూలై,2024  మూడు వారం నుంచి  నాలుగు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు  కేంద్రం తెలిపింది.  ఈ ఎగ్జామ్ లో ఎవరైన అభ్యర్థులను అవకతవకలకు పాల్పడినట్లు తేలితే.. వారిని అభర్థిత్వం రద్దు చేస్తామని కేంద్రం తన అఫిడవిట్ లో కోర్టుకు తెలిపింది. మరోవైపు లీకైన పేపర్‌కు సంబంధించిన ఫోటోలను చూపుతున్న టెలిగ్రామ్ వీడియోలు నకిలీవి అని NTA సుప్రీంకోర్టుకు తెలిపింది.

NEET-UG 2024లో జాతీయ, రాష్ట్ర, నగర స్థాయిలో కేంద్ర స్థాయిలో అభ్యర్థుల మార్కుల పంపిణీపై NTA విశ్లేషణను నిర్వహించిందని పేర్కొంది. ఈ విశ్లేషణ మార్కుల పంపిణీ చాలా సాధారణంగా ఉన్నాయిని మార్కుల పంపిణీని ప్రభావితం చేసే అదనపు కారకం ఏమీ లేదని తెలిపింది. NEET UG 2024 పేపర్ లీక్ కేసులో దేశవ్యాప్తంగా దాఖలైన 43 పిటిషన్‌లను విచారించి సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి ఒక రోజు ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో తన అఫిడవిట్‌ను దాఖలు చేసింది.