టూమచ్ రా.. రే : పిల్లోడిని బండిపై ఇలా తీసుకెళతారా..!

టూమచ్ రా.. రే : పిల్లోడిని బండిపై ఇలా తీసుకెళతారా..!

ఇటీవల సోషల్ మీడియాలో చాలా వింతలూ, విడ్డూరాలు చూడాల్సి వస్తోంది. బెంగళూరులో చోటు చేసుకున్న ఒక విడ్డూరమైన సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలో స్కూటర్ మీద వెళ్తున్న ఓ జంట పిల్లాడిని స్కూటర్ యొక్క ఫుట్ రెస్ట్ మీద నిలబెట్టుకొని తీసుకెళ్లారు. ఈ ఉదంతాన్ని ఒక నెటిజన్ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. సదరు పేరెంట్స్ నిర్లక్ష్యాన్ని వీడియో కింద కామెంట్స్ లో ఎండగడుతున్నారు నెటిజన్స్.

 

ఈ వీడియోకు రియాక్ట్ అయిన బెంగళూరు పోలీస్ శాఖ, వైట్ ఫీల్డ్ కి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ట్యాగ్ చేస్తూ డీటెయిల్స్ చెక్ చేసి తగిన యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటమే నిర్లక్ష్యం అయితే, ఇది అంతకు మించిన నిర్లక్ష్యమని, ఏ మాత్రం బ్యాలెన్స్ అటు,ఇటూ అయినా పిల్లాడితో పాటు అతన్ని పట్టుకున్న తల్లి కూడా కింద పడే ప్రమాదం ఉందని, రోడ్ మీద ఇడియట్స్ ఎక్కువవుతున్నారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.