మొగుళ్లపల్లి మండలంలో ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం..ఒకరు డిస్మిస్, మరొకరు సస్పెన్షన్ : కలెక్టర్ రాహుల్ శర్మ

మొగుళ్లపల్లి మండలంలో ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం..ఒకరు డిస్మిస్, మరొకరు సస్పెన్షన్ : కలెక్టర్ రాహుల్ శర్మ
  •     ఇద్దరిపై వేటు వేసిన కలెక్టర్​ రాహుల్​ శర్మ

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరిపై వేటు పడింది. పీఏసీఎస్ సీఈవో అప్పం సాగర్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్​ చేయడమే కాకుండా మొట్లపల్లి పీపీసీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఎన్.ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ను విధుల నుంచి డిస్మిస్​ చేసినట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి వాల్యా నాయక్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

మంగళవారం కలెక్టర్ రాహుల్​శర్మ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన సమయంలో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, ధాన్యాన్ని తరలించడంలో నిర్లక్ష్యం చేసినట్లు గుర్తించారని ఆయన తెలిపారు. దీంతో సీఈఓ, సెంటర్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.