ఓటరు జాబితాలపై నిర్లక్ష్యం..ముగ్గురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు

ఓటరు జాబితాలపై నిర్లక్ష్యం..ముగ్గురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ఓటరు లిస్ట్​పై నిర్లక్ష్యం వహించిన జూబ్లీహిల్స్ నియోజక వర్గ పరిధిలో  225,219  పోలింగ్ స్టేషన్ల  బీఎల్వో, సూపర్ వైజర్, రిసోర్స్​పర్సన్​కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయా పోలింగ్ స్టేషన్ పరిధిలో షిఫ్టింగ్ ఓటర్ల పరిశీలనలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సిబ్బందికి  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఈఆర్వో, డిప్యూటీ కమిషనర్ బుధవారం నోటీసులు జారీ చేశారు.  24 గంటల్లో వారు సంజాయిషీ ఇవ్వాలని లేదంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 225వ బూత్ స్థాయి అధికారి  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి  ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్​ఎన్.రాజేందర్, బూత్ లెవెల్ సూపర్ వైజర్,  అదే  215 వ బూత్​రిసోర్స్ పర్సన్ ఇందిరాను టెర్మినేట్​ చేసేందుకు సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఆదేశాలు జారీచేశారు.