అద్భుతంగా పాట పాడిన ఓ గాయకుడిని అభినందిస్తూ.. హగ్ చేసుకున్న ఓ మహిళా జడ్జీకి ముద్దు పెట్టాడు ఆ కంటెస్టెంట్. దీంతో జడ్జీలు వ్యవహరిస్తున్న మిగతా వారు…కార్యక్రమం చూస్తున్నవారు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. కిస్ చేసిన కంటెస్టెంట్ ను ఆ ఫ్రోగ్రాం నుంచి పంపించేశారు నిర్వాహకులు.
సోనీ ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘ఇండియన్ ఐడల్ 11’ రియాల్టీ షోలో ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహ కక్కర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాడడానికి వచ్చిన ఓ 31 ఏళ్ళ గాయకుడు పాటపాడిన తర్వాత తనను గుర్తుపట్టాల్సిందిగా జడ్జి నేహాను కోరాడు. దాంతో ఆమె స్టేజీ పైకి వెళ్లింది. అప్పుడు అతడు తన వెంట తీసుకొచ్చిన కొన్ని గిఫ్టులను ఆమెకు ఇచ్చాడు. ఆమె కృతజ్ఞతగా ఆ వ్యక్తిని కౌగిలించుకోగా.. ఒక్కసారిగా అతడు బలవంతంగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో మాలిక్, విశాల్ దడ్లాని, యాంకర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యాంకర్ ఆదిత్య నారాయణ్ ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ కంటెస్టెంట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
