అమేథీని అభివృద్ధికి దూరం చేశారు.. స్మృతి ఇరానీ ఫైర్

అమేథీని అభివృద్ధికి దూరం చేశారు..   స్మృతి ఇరానీ ఫైర్

అమేథీ: నెహ్రూ, -గాంధీ కుటుంబీకులు అమేథీ నియోజకవర్గాన్ని 50 ఏండ్లు అభివృద్ధికి దూరంగా ఉంచారని కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ స్మృతి ఇరానీ మండిపడ్డారు. దీంతో అక్కడి ప్రజలు పేదలు, నిస్సహాయులుగా మిగిలిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సెగ్మెంట్​లోని పాండేగంజ్ గ్రామంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గాంధీ కుటుంబం వల్ల అమేథీలోని 1.08 లక్షల కుటుంబాలకు ఇండ్లు, 4 లక్షల కుటుంబాలకు కుళాయిలు, 3 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని మంత్రి ఆరోపించారు. ఇక్కడి నుంచి ఎన్నికైన ఎంపీలకు ప్రజలతో ఎలాంటి సంబంధం ఉండేది కాదని, ఐదేండ్లకు ఒకసారి అమేథీకి వచ్చేవారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజలు అభివృద్ధి చేయాలని తమ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నారని ఆమె అన్నారు.