పెరగనున్న జూపార్క్ టికెట్ ధరలు.. ఒక్కొక్కరికి ఎంతంటే?

పెరగనున్న జూపార్క్  టికెట్ ధరలు.. ఒక్కొక్కరికి ఎంతంటే?


హాలీడేస్ వచ్చాయంటే చాలు.. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసే ప్లేస్ లలో జూపార్క్ ఒకటి. అయితే ఇప్పుడు జూపార్కుల ఎంట్రీ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి.  ఈ మేరకు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన మే 02 మంగళంవారం రోజున జూపార్క్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాలకమండలి సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో నెహ్రు జూపార్క్ టికెట్ ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకోగా  పాలక మండలి కూడా అమోదం తెలిపింది.  నెహ్రు జూ పార్కును కూడా  అంతర్జాతీయ ప్రమాణలతో అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూ పార్కుల్లో సదుపాయాల్ని పెంచాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకర్షించడానికి అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. 

పెరిగిన ధరలు

కొత్తగా పెరిగిన జూ పార్క్ టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. పెద్దలు ఇకపై వీక్ డేస్‌లో జూ పార్క్ సందర్శనకు రూ.70 , సెలవు దినాల్లో రూ.80 చెల్లిస్తారు. అయితే పిల్లలు సాధారణ రోజుల్లో రూ.45 పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్‌లో రూ.55 చెల్లించాలి. ధరలు పెంచకముందు పెద్దలకు సాధారణంగా వర్కింగ్ రోజుల్లో రూ.60, వారాంతాల్లో, సెలవు దినాల్లో రూ.75 ఉండగా.. పిల్లల టిక్కెట్లు వారాంతపు రోజుల్లో రూ.40, సెలవు దినాల్లో రూ.50గా ఉండేవి. అయితే అధిక ఆదాయం వచ్చేలా అటవీ శాఖ జూ పార్క్ ఎంట్రీ ధరను అంతటా పెంచాలని నిర్ణయించింది.  అయితే  కొత్త ధరలు ఎప్పుడు అమల్లోకి వస్తాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.  

60 వసంతాలు పూర్తి

60 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ జూ పార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. హనుమకొండలోని కాకతీయ జూ పార్కు, మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి మినీ జూపార్కు, కరీంనగర్, పాల్వంచలలోని జింకల పార్కులు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కేబీఆర్, మృగవని, హరిణి వనస్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృషి పెట్టింది.