
అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా రాజేంద్ర ప్రసాద్, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనెవరు?’. సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి నిర్మించారు. దసరా సందర్భంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.
గొప్ప సందేశభరిత కథతో ఈ చిత్రం తెరకెక్కిందని, తాను నటించిన మంచి చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మంచి చిత్రంలో పార్ట్ అవడం సంతోషంగా ఉందని నటీనటులు, రాజేంద్ర ప్రసాద్‌తో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.