బహుభార్యత్వాన్ని చట్టబద్ధం చేసే పనిలో నేపాల్.. ఏఏ దేశాల్లో ఇది అమలులో ఉందంటే..?

బహుభార్యత్వాన్ని చట్టబద్ధం చేసే పనిలో నేపాల్.. ఏఏ దేశాల్లో ఇది అమలులో ఉందంటే..?

భారత్ పొరుగేశమైన నేపాల్ బహుభార్యత్వాన్ని చట్టబద్ధమైనదిగా చేసేందుకు చట్టాలకు మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఆ దేశంలోని ప్రజలు ఒకరి కంటే ఎక్కువ భర్తలు లేదా భార్యలను కలిగి ఉండటానికి అనుమతి లభించనుంది. అయితే ప్రభుత్వ ఆలోచనపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రపంచ దేశాలు ముందుకెళ్లటానికి ప్రయత్నిస్తుంటే తమ దేశం మాత్రం వెనక్కి ప్రయాణించే పనిలో ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

2025 లాంటి ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ బహుభార్యత్వం అనే విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనుమతిస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి. మహిళలను పురుషుల కంటే తక్కువగా చూస్తూ వారిని దోపిడీ చేసేందుకు ఈ విధానాన్ని వాడుతున్నారని వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలోని ముస్లిం దేశాల్లో దీనిని చట్టం అనుమతిస్తోంది. బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి. 

ALSO READ : భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా?

* పాకిస్థాన్ లో ముస్లిం పురుషులకు బహుభార్యత్వం చట్టప్రకారం అనుమతించబడింది. అయితే గరిష్ఠంగా వారు 4 భార్యలను మాత్రమే కలిగి ఉండటానికి పరిమితి విధించబడింది. 

* మరో ముస్లిం దేశం అయిన అఫ్ఘనిస్థాన్ కూడా నలుగురు భార్యలను కలిగి ఉండేందుకు చట్ట ప్రకారం అనుమతిస్తోంది. 

* ఇక శ్రీలంక చట్టాలు బహుభార్యత్వాన్ని అలాగే బహుభర్తత్వాన్ని.. ప్రజలకు అనుమతిస్తోంది. అక్కడి పురుషులు, స్త్రీలకు ఈ పద్ధతి మోస్ట్ కామన్. 

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2 శాతం మంది మాత్రమే బహుభార్యత్వ కుటుంబాల్లో నివసిస్తున్నట్లు తేలింది. వీరిలో ఎక్కువ మంది సబ్-సహారా ఆఫ్రికాలో నివసిస్తున్నారు. అక్కడ దాదాపు 11 శాతం మంది బహుభార్యత్వాన్ని అవలంబించారు. ఇండియాలో మాత్రం ఈ విధానం చట్టవిరుద్ధమైనదే.