రాఖీ పండుగ స్పెషల్: భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? బలి రాజు – లక్ష్మీదేవి... కృష్ణుడు–ద్రౌపది.. సంబంధంపై పురాణాలు ఏం చెబుతున్నాయి..?

రాఖీ పండుగ స్పెషల్: భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? బలి రాజు – లక్ష్మీదేవి... కృష్ణుడు–ద్రౌపది..  సంబంధంపై పురాణాలు ఏం చెబుతున్నాయి..?

రాఖీ పండుగ .. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.. అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు.. గొప్పగా జరుపుకునే పండుగ.  రాఖీ పండుగ రోజు ( ఆగస్టు 9) సోదరుడికి.. సోదరీ మణులు రాఖీ కడతారు.  ఇంకా ఎలాంటి రిలేషన్​ కలిగిన వారు రాఖీ కట్టుకోవచ్చు.. భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా.. పురాణాల్లో ఏముంది.. దేవతలు ఎవరెవరు రాఖీ కట్టుకున్నారు..  మొదలగు విషయాల గురించి  ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా?

రాఖీ అంటే రక్షగా ఉంటామని  ఇచ్చే వాగ్దానం. ఎటువంటి పరిస్థితులు ఎవరైనా రాఖీ కట్టిన వారికి అండగా నిలబడి వారిని ఎల్లవేళలా రక్షించాలి.  భార్య తన భర్తకు (రాఖీ) రక్షాబంధనం  కట్టే సాంప్రదాయం పురాణాల్లో ఉంది. . 

ఇంద్రుడికి రాఖీ కట్టిన భార్య ఇంద్రాణి

వేదకాలంలో రాక్షసులు, దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శ్రావణమాసంలో పౌర్ణమి రోజు జరిగింది. రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో ఇంద్రుడు ఆందోళనలో పడతాడు. రాక్షసులు యుద్ధంలో గెలిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచిస్తూ భయపడిన ఇంద్రుడు తన గురువు ‘బృహస్పతి’ని సలహా అడిగాడు. ఇంద్రుడి భార్య ఇంద్రాణితో అతని మణికట్టుపై (రాఖీ ) రక్ష సూత్రం కట్టమని బృహస్పతి సూచిస్తాడు. అతని సలహాతో ఇంద్రాణి శ్రావణ పౌర్ణమినాడు ఇంద్రుడి మణికట్టుకు రాఖీ కట్టింది. ఆమె రక్షగా కట్టిన దారం ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే యుద్ధంలో దేవతల విజయానికి దోహదపడింది..

శ్రీకృష్ణుడికి రక్షాబంధనం కట్టిన ద్రౌపది

పురాతన కాలం నుండి రక్షాబంధన్ గురించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. వాటిలో మహాభారత కాలం నాటి ఒక సంఘటన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని సంహరించిన తర్వాత చక్రాన్ని తిరిగి ఇచ్చే తీసుకునే సమయంలో శ్రీ కృష్ణుని మణికట్టుకు దెబ్బ తగులుతుంది. అది చూసిన ద్రౌపది..  శ్రీ కృష్ణునికి  వెంటనే ఆమె చీరకొంగును చించి శ్రీకృష్ణుని మణికట్టుకు కట్టు కట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్షాసూత్రం కారణంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తానని వాగ్దానం చేశాడట.  దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి .. దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను ఆదుకున్నాడు..

లక్ష్మీదేవికి ఎవరికి రాఖీ కట్టింది..

స్వర్గలోకాధి పతి దేవేంద్రడు రాజ్యమైన అమరావతిని.. భూమండలాన్ని  బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి, తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడికి శక్తి సరిపోక విష్ణుమూర్తి దగ్గరకు వెళతాడు.  

Also Read : 95 ఏళ్ల తర్వాత అద్భుత సమయంలో ఈసారి రక్షా బంధన్ వస్తుంది..!

మానవులను ... దానవులను రక్షించేందుకు  శ్రీ మహావిష్ణువు.. బలి చక్రవర్తి  ఎక్కడ ఉన్నాడో గుర్తించి అక్కడకు వస్తాడు.  ఆ సమయంలో భూలోకంలో ఉండటంతో భూలోకాని విష్ణుమూర్తి చేరుకున్నాడు.ఆ సమయంలో   శ్రీమన్నారాయణుడితో పాటు అతని భార్య లక్ష్మీదేవి కూడా భూలోకానికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అప్పుడు .. లక్ష్మీదేవి .. ఒక బ్రాహ్మణ యువతి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు శ్రావణ పౌర్ణమి రోజున వెళుతుంది.  బలి చక్రవర్తి చేతికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.

రక్షా బంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైనా కానీ ఈ సంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. సాధారణ రాఖీల నుండి విదేశాలలో ఉన్న సోదరులకు పంపించే ఆధునిక ఇ-రాఖీల వరకు రక్షా బంధన్ బాగా అభివృద్ధి చెందింది. బంధాలను బలోపేతం చేస్తూనే ఉంది. పురుషుడు లేదా స్త్రీ, పట్టింపు లేదు.. ప్రతి రక్షకుడు రాఖీకి అర్హుడు.. మొదటి రాఖీని ఎవరు కట్టారు అనేది ఎవరికి తెలియని రహస్యం కావచ్చు. కానీ రక్షాబంధన్ ఓ సంతోష సంబరం. పండుగ ఏదైతేనేమి పదిమంది కుటుంబ సభ్యులు కలిస్తే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లవుతుందికదా..!