రాఖీ పండుగ 2025 : 95 ఏళ్ల తర్వాత అద్భుత సమయంలో ఈసారి రక్షా బంధన్ వస్తుంది..!

రాఖీ పండుగ 2025 : 95 ఏళ్ల తర్వాత అద్భుత సమయంలో ఈసారి రక్షా బంధన్ వస్తుంది..!

రాఖీ పండుగ.. రక్షాబంధన్​ పండుగ అన్నదమ్ములకు... అక్క చెల్లెళ్లకు చాలా ప్రాముఖ్యమైన పండుగ.  ఈ పండగ రోజు సోదరీమణులు.. సోదరుల చేతికి రాఖీ కట్టి  వారి మంచిని కోరుకుంటారు.  ఈ ఏడాది ( 2025) ఆగస్టు 9 వ తేదీన వచ్చింది.  జ్యోతిష్య శాస్త్రప్రకారం ఈ ఏడాది రాఖీ పండుగకు చాలా విశిష్టత ఉందని చెబుతున్నారు. 95 ఏళ్ల తరువాత మళ్లీ ఆగస్టు 9న  అంటే 1930 లో ఉన్న గ్రహాల సంచారం పునరావృతం కానుంది. . .

రాఖీ పండుగ ముహూర్తం..

  • పూర్ణిమ తిథి ప్రారంభం :  ఆగస్టు 8  మధ్యాహ్నం 2:12 గంటలకు
  • పూర్ణిమ తిథి ముగింపు:  ఆగష్టు 9 మధ్యాహ్నం 1:21 గంటలకు
  •  రాఖీ కట్టేందుకు  శుభ ముహూర్తం : ఆగష్టు 9  ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది రాఖీ పండుగ రోజు ( శ్రావణమాసం.. పౌర్ణమి ఘడియల్లో)  సౌభాగ్య యోగం, శోభన యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్నాయి. వాటితో పాటు శ్రవణా నక్షత్రం కలిసి రావడం అద్భుతమని పండితులు చెబుతున్నారు.  గతంలో 1930 లో అంటే 95 ఏళ్ల క్రితం ఇలా మూడు యోగాలు కలసి వచ్చాయని పండితులు చెబుతున్నారు. 

పంచాంగం ప్రకారం శ్రవణా  నక్షత్రం ఆగస్టు 10 మధ్యాహ్నం 2:23 గంటల వరకు  ఉంటుంది.  శ్రావణమాసం.. శ్రవణా నక్షత్రంలో ఏ పని తలపెట్టిన శుభప్రదంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని పండిలు చెబుతారు.  ఇంకా  ఆ  రోజున బావ మరియు బలవ వంటి కరణాలు కూడా ఉండటంతో మరింత శుభప్రదంగా భావిస్తారు.

రాఖీ పండుగరోజు ఏర్పడే యోగాలు:

ఈ ఏడాది ( 2025) రాఖీ పండుగ రోజు ( ఆగస్టు 9) మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి. 
 సౌభాగ్య యోగం:  ఇది  ఆగస్టు 9 వ తేది నుంచి ఆగస్టు 10  మధ్యాహ్నం 2:15 గంటల వరకు ఉంటుంది  ఈ సమయం కొత్త పనులు ప్రారంభించేందుకు చాలా అనుకూలమని పండితులు చెబుతున్నారు. జీవితంలో సుఖ సంతోషాలు, అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు.

 
  శోభన యోగం: శోభనయోగం కూడా అదే సమయంలో ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ..  ఆనందం ఉంటాయి. ఈ యోగం వల్ల సోదరసోదరీమణుల బంధం మరింత బలపడుతుంది, వారి జీవితాలలో సుఖశాంతులు నెలకొంటాయని చెబుతున్నారు.


సర్వార్థ సిద్ధి యోగం : ఆగస్టు 10 న  ఉదయం 5:47 నుండి మధ్యాహ్నం 2:23 గంటల వరకు ఉంటుంది , ఈ సమయంలో  చేసే ప్రతి శుభకార్యం విజయానికి దారితీస్తుంది.ఈ అరుదైన యోగం  లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో విజయం తప్పదు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు  ఇదే మంచి సమయమని పండితులు సూచిస్తున్నారు.  
 
ఈ మూడు యోగాలు కలిసినప్పుడు కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటించాలని చెబుతున్నారు.

  • సూర్యోదయానికి ముందే  పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. అలా అవకాశం లేకపోతే బోరు దగ్గర.. బావి దగ్గర.. కుళాయిల దగ్గర  గంగా జలాన్ని కలిపి స్నానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది.  

స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం:  


గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ। 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు।।

  • లక్ష్మీనారాయణులను ప్రతిష్టించి పూజించాలి.సోదరీమణులు శుభ సమయంలో తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టాలి.
  •  సోదరులకు, సోదరీమణులకు దుస్తులు, ఆభరణాలు .. బహుమతులు ఇచ్చి వారిని గౌరవించాలి.

ఈ మూడు యోగాలు కలిసిన సమయంలో దానాలు.. ఉపవాసం చేయాలి.  సాధ్యమైనంత ఎక్కువసేపు భగవంతుడిని ధ్యానించాలి.  ఇలా చేయడం వలన కోరికలు తీరడమే కాకుండా.. జాతక రీత్యా దోషాలు తొలిగి...  అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

►ALSO READ | సంతాన ఏకాదశి: కొత్తగా పెళ్లయిన వారు రేపు ( ఆగస్టు 5) చేయాల్సిన వ్రతం ఇదే..!