
హైదరాబాద్ : ఆదివారం అర్థరాత్రి నేరెడ్మెట్, ఈస్ట్ కృపా అపార్ట్మెంట్ లో నివసించే శ్యాం సుందర్ (31) అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే.నేరెడ్మెట్ పోలీస్టే షన్ పరిధిలో జరిగిన ఈ మర్డర్ కేసును చేధించారు పోలీసులు. బాధితురాలు మృతుడు శ్యాం సుందర్ తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆదారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా మర్డర్ చేసింది విజయ అపార్ట్మెంట్ లో నివసించే నవీన్ (33) గా గుర్తించామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు..కక్షతోనే తన ఫ్రెండ్ శ్యాం సుందర్ ను ను హత్య చేసినట్లు నవీన్ ఒప్పుకున్నాడన్నారు. దీంతో నిందితుడు నవీన్ న్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు నేరెడ్ మెట్ పోలీసులు.