నూట్రిషనల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అమ్మేందుకు .. డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌, నెస్లే జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నూట్రిషనల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అమ్మేందుకు .. డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌, నెస్లే జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: విటమిన్స్‌‌‌‌‌‌‌‌, మినరల్స్ వంటి నూట్రిషన్స్ ఉండే  ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను  మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌, నెస్లే ఇండియా చేతులు కలిపాయి. ఇరు కంపెనీలు కలిసి ఓ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశాయి. నూట్రిషనల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను ఇండియా, ఇతర మార్కెట్లలో అమ్మనున్నారు. నెస్లే హెల్త్‌‌‌‌‌‌‌‌ సైన్సెస్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ) కు  చెందిన  విటమిన్స్‌‌‌‌‌‌‌‌, మినరల్స్‌‌‌‌‌‌‌‌, హెర్బల్స్‌‌‌‌‌‌‌‌, సప్లిమెంట్స్‌‌‌‌‌‌‌‌, ఇతర న్యూట్రిషనల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌కు ఉన్న నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌తో ఇండియాలో అమ్మనున్నారు.

నేచర్స్‌‌‌‌‌‌‌‌ బౌంటి, ఓస్టియో బై ఫ్లెక్స్‌‌‌‌‌‌‌‌, ఈస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– సీ, రిసోర్స్‌‌‌‌‌‌‌‌ హై ప్రొటీన్‌‌‌‌‌‌‌‌, ఆప్టిఫాస్ట్‌‌‌‌‌‌‌‌, రిసోర్స్‌‌‌‌‌‌‌‌ డయాబెటిక్, పెప్టామెన్‌‌‌‌‌‌‌‌, రిసోర్స్‌‌‌‌‌‌‌‌ రెనాల్‌‌‌‌‌‌‌‌, రిసోర్స్ డయాలసిస్‌‌‌‌‌‌‌‌ వంటి  నెస్లే గ్రూప్ బ్రాండ్ల లైసెన్స్‌‌‌‌‌‌‌‌ను,  డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌కు చెందిన రెబలాంజ్‌‌‌‌‌‌‌‌, సెలెవిడి, యాంటాక్సిడ్‌‌‌‌‌‌‌‌, కిడ్రిక్‌‌‌‌‌‌‌‌–డీ3, బెకాజింక్‌‌‌‌‌‌‌‌  బ్రాండ్ల లైసెన్స్‌‌‌‌‌‌‌‌ను  ఈ జాయింట్‌‌‌‌‌‌‌‌ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీకి అందివ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి  నెస్లే, డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌ జాయింట్ వెంచర్ కంపెనీ అందుబాటులోకి రానుంది.