16 వేల మందిని తీసేయనున్న నెస్లే..

 16 వేల మందిని తీసేయనున్న నెస్లే..

న్యూఢిల్లీ: ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీ నెస్లే   16 వేల మంది ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించింది.  కంపెనీ  మొత్తం ఉద్యోగుల సంఖ్య 2, 77,000. తాజా లేఆఫ్‌‌‌‌లో  12 వేల వైట్ కాలర్ ఉద్యోగాలు, 4 వేల  తయారీ, సరఫరా విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయని కంపెనీ  కొత్త సీఈఓ  ఫిలిప్ నావ్రాటిల్ పేర్కొన్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  కాఫీ, చాక్లెట్, మాగీ వంటి ప్రొడక్ట్‌‌‌‌ల సేల్స్ పెరిగాయని అన్నారు.  నెస్లేలో మేనేజ్‌‌‌‌మెంట్ స్థాయిలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. లారెంట్ ఫ్రెక్సీ స్థానంలో ఫిలిప్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా పాబ్లో ఇస్లాకు  బాధ్యతలు ఇచ్చేందుకు  చైర్మన్ పాల్ బుల్కే తన పదవికి రాజీనామా చేశారు. 


ఖర్చులు తగ్గించుకోవడంపై కంపెనీ కొత్త సీఈఓ, చైర్మన్  ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. 2027 నాటికి 3 బిలియన్ స్విస్‌‌‌‌ఫ్రాంక్‌‌‌‌ల విలువైన ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీ టార్గెట్‌‌‌‌గా పెట్టుకోవడం ఇందుకు నిదర్శనం.