మరో ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ మూవీ.. 18 మంది యోధుల కథ: తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మరో ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ మూవీ.. 18 మంది యోధుల కథ: తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రతిసినిమా హిట్ అవుతుంది. ఇటీవలే మహావతార్ నరసింహ ఎలాంటి భీభత్సం సృష్టించిందో చూసాం. ఈ క్రమంలోనే ఇండియన్ మేకర్స్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ హీట్ పెంచుతున్నారు. మొన్నటికి మొన్న సితార బ్యానర్ వాళ్లు 'వాయుపుత్ర' టైటిల్ అనౌన్స్ చేసి ఆసక్తి పెంచారు.

అయితే, ఇలాంటి మైథలాజికల్ సినిమాలకు కథ..ఫైనల్ అల్టిమేట్ కావడం వల్ల హీరో, హీరోయిన్స్తో పని ఏ మాత్రం ఉండదు. ఒక్క పెద్ద హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్లో సగం బడ్జెట్ని సినిమాకు వెచ్చించి కోట్లు రాబడుతున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే నెట్‌‌‌‌ఫ్లిక్స్ 'కురుక్షేత్ర' యుద్ధంపై తీసిన యానిమేటెడ్ సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతోంది.

"కురుక్షేత్ర: మహాభారత్ గ్రేట్ వార్" పేరుతో వచ్చిన ఈ సిరీస్ అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ని అలోక్ జైన్, అను సిక్కా, అజిత్ అంధారే నిర్మించారు. ఉజాన్ గంగూలీ రచించి దర్శకత్వం వహించారు. ప్రముఖ కవి, గేయ రచయిత గుల్జార్ పాట‌ల‌ను అందించారు. ఈ సిరీస్కు చిన్నపిల్లల నుంచి మంచి హైప్ వస్తుంది. వీకెండ్లో ఫ్యామిలీతో పాటు చూసి మంచి ఫీల్ పొందారు. ఇక ఆలస్యం ఎందుకు చుడనివాళ్లు ఎంచక్కా చూసేయండి!! 

కథేంటంటే:

మహాభారతం ఇప్పటికే వివిధ భాషల్లో లెక్కలేనన్ని సార్లు సినిమా, సీరియల్స్‌‌‌‌గా వచ్చింది. ఇప్పుడు అందులోని ‘కురుక్షేత్రం’ యుద్ధం పార్ట్‌‌‌‌ని యానిమేషన్‌‌‌‌ వెబ్‌‌‌‌సిరీస్‌‌‌‌గా తెరకెక్కించారు. 18 రోజుల పాటు జరిగే యుద్ధం.. అందులో  పాల్గొన్న 18 మంది యోధుల కథలను ఈ సిరీస్‌‌‌‌లో చూపించారు.

ఇప్పుడు రిలీజైన మొదటి పార్ట్‌‌‌‌ని తొమ్మిది మంది యోధులు సంజయుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అభిమన్యుడు, జయద్రథుడు, అర్జునుడు, ఘటోత్కచుడు, యుధిష్ఠరుడిపై రూపొందించారు.

ముఖ్యంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించడం.. భీష్ముడి ఓటమి తర్వాత దుర్యోధనుడి సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియామకం కావడం.. అభిమన్యుడిని చంపడం లాంటి సంఘటనలను బాగా తెరకెక్కించారు.