
గురు సినిమాలో రితికా సింగ్(Ritika Singh)ను ఇష్టపడని వారు ఉండరేమో. తన నటనతో అంతలా ప్రేక్షకులను ఈ బ్యూటీ కట్టి పడేసింది. సోషల్ మీడియాలో రితికాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీ గానే ఉంది. బాక్సర్ అయిన రితికా ఫిట్ నెస్ వీడియోలతోనూ ఆకట్టుకుంటుంది.
ఇటీవల ఈ బ్యూటీ కాస్త బరువు పెరిగి బొద్దుగా తయారైంది. చీరలో హాట్ ఫొటోషూట్లతో కుర్రకారు మతులు పోగొట్టింది. ఉన్నట్టుండి ఓ పోస్ట్‌తో తన ఫ్యాన్స్‌కు ఈ నటి షాకిచ్చింది. తన భారీ అందాలకు ఇక గుడ్‌బై చెప్పే టైం వచ్చిందని ఓ ఫొటో పోస్ట్ చేసింది. అందంతో పాటుగా మందంగా తయారవుతున్నావంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారట. అందుకే బరువు తగ్గే పనిలో పడ్డానని తెలిపింది. కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలాగే బాగున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ కొత్తా లో రితికా ఓ సాంగ్‌లో మెరిసింది.
కాగా.. రితికా సింగ్ తమిళ మూవీ ఇరుధి సూత్ర తో ఫేమస్ అయింది. ఇక తెలుగులో వెంకటేష్ గురు మూవీలో తన యాక్టింగ్ గ్రేస్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.రితికా సింగ్ ఆండవన్ కోమండి, శివలింగ, ఓ మై గాడ్, కోలా, బిచ్చగాడు-2 మూవీస్ లో నటించింది. రితికా సింగ్ మార్షల్ ఆర్టిస్ట్ లో పేరు పొందింది. ప్రసెంట్ రితికా మూవీస్ తో పాటు, సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేస్తుండటంతో..నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు