ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్స్ తింటే మీ పని అంతే..

 ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్స్ తింటే మీ పని అంతే..

డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఫొలేట్, విటమిన్ సి, ప్రోటిన్,  పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రం ఉదయాన్నే తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఎప్పుడూ బ్యాలెన్సడ్ న్యూట్రీషన్ ఫుడ్ మాత్రమే తినాలి. అంటే తినే ఆహారంలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.  ఓకే రకమైన పోషకాలు అధికంగా ఎప్పుడు తీసుకోవద్దు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

కిస్ మిస్
న్యాచురల్ షుగర్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎనర్జీ బూస్టింగ్ ఇస్తాయి. కానీ ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఎండు ద్రాక్ష (కిస్ మిస్) తింటే బ్లడ్ లో అకస్మాత్తుగా పెరిగిపోతాయి. అప్పుడు మీరు నీరసంగా ఉంటారు. సమతుల్య ఆహారం మాత్రమే తీసుకోవాలి. పెరుగతో కలిపి తానవచ్చు.

ఎండిన ఆఫ్రికాట్లు
ఆప్రికాట్ లో విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటాయి.  హై షుగర్స్ ఉంటాయి. కాబట్టి అవి ఎట్మీ స్టమక్ తో తింటే జీర్ణక్రియకు కారణమవుతుంది.
ఎండిన ఆప్రికాట్లు డీహైడ్రేట్ అయి ఉంటాయి. అందువల్ల వాటిలో చక్కర, కేలరీలు మాత్రమే ఉంటాయి. ఎండిన, పచ్చి ఆప్రికాట్ లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లు ఎక్కువగానే  ఉంటాయి. తినాలనుకుంటే పనీర్ లేదా ప్రోటీన్ ఉండే పదార్థాలతో కలిపి తినవచ్చు.

డ్రై చెర్రీస్
డ్రై చెర్రీస్ టేస్టీగా ఉంటాయి కానీ, ఉదయాన్నే తినకూడదు. ఖాళీ కడుపుతో చెర్రీస్ తింటే యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి.  ఎందుకంటే వీటిలో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువ. డ్రై చెర్రీస్ లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇవి ప్రేగుల ద్వారా శోషించబడని పిండి పదార్థాలను తయారు చేస్తోంది. దీంతో పులియబెట్టగల ఒలిగోశాకరైడ్లు, డైసాకరైడ్లు, మోనోశాకరైడ్లు, పాలియోల్స్ ని ఉత్పన్నం అవుతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు చెర్రీలను తింటే గ్యాస్, పొట్ట ఉబ్బరం, అతిసారం కడుపు నొప్పి వస్తుంది.

ఖజ్జురం
మార్నింగ్ వీటిని తింటే ఒక్కసారిగా బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. దీంతో మీరు నీరసంగా అయిపోతారు. ఉదయాన్నే ఖజ్జుర పండ్లు తింటే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని న్యూట్రీషీయన్స్ చెప్తున్నారు.

ఉదయాన్నే ఇవి తినండి
న్యూట్రీషీయన్స్ ప్రకారం ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ కు బదులుగా కొన్ని  ఆహారపదార్థాలు తినవచ్చు. అవి అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ కూడా అందుతాయి. ఆ సమతుల్య ఆహారం ఎంటంటే..
ఓట్ మీల్ 
పెరుగు
గుడ్లు
తాజా బెర్రీలు
 బ్రెడ్
స్మూతీస్
అవకాడో

 

ALSO READ :-Manipur: మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్‌.. రక్షించిన భద్రతా బలగాలు