సర్కారు బడులకు కొత్త అడ్మిషన్లు వస్తలే

సర్కారు బడులకు కొత్త అడ్మిషన్లు వస్తలే
  • బడిబాట అంతంతే..
  • సర్కారు బడులకు కొత్త అడ్మిషన్లు వస్తలే

మహబూబ్​నగర్​, వెలుగు:  గవర్నమెంట్ స్కూల్స్​లో కొత్త అడ్మిషన్లు పెరగడం లేదు. స్కూళ్లు రీ ఓపెన్​ చేసి పది రోజులు అవుతున్నా ఆశించిన స్థాయిలో స్టూడెంట్లు చేరడం లేదు. ‘బడిబాట’ ఎన్​రోల్​మెంట్​డ్రైవ్​ నిర్వహించినా ఆఫీసర్లు, టీచర్లు పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడంతోనే సక్సెస్‌‌ కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  సర్కారు బడుల్లో సరిపడా టీచర్లు, సరైన సౌకర్యాలు లేకపోవడంతో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇంట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపలేదని తెలుస్తోంది.  ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పెరగడం గమనార్హం.  కరోనా సమయంలో ప్రైవేటును వీడి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన స్టూడెంట్లు కూడా మళ్లీ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నారు. 


రెండేండ్ల తర్వాత..


కొవిడ్​ నేపథ్యంలో 2020–-21, 2021-–22 అకడమిక్‌‌ ఇయర్‌‌‌‌లో ‘బడిబాట’ నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత ఈ నెల 3  నుంచి 10వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్​లో గుర్తించిన వారితో పాటు ఈ నెల 21వ తేదీ నాటికి పాలమూరు జిల్లాలోని 859 గవర్నమెంట్​ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,779 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. వీరిలో మండలాల వారీగా అడ్డాకులలో 201మంది, బాలానగర్​లో 179, భూత్పూర్​లో 155, చిన్నచింతకుంటలో 160, దేవరకద్రలో 99, గండీడ్​లో 177, హన్వాడలో 121, జడ్చర్లలో 29, కోయిల్​కొండలో 306, మహబూబ్​నగర్​ అర్బన్​లో​ 290, మహబూబ్​నగర్​ రూరల్​లో 67, మిడ్జిల్​ 141, మహ్మదాబాద్​ 299, మూసాపేట 180, నవాబ్​పేట 222, రాజాపూర్​లో 154 మంది స్టూడెంట్లు చేరారు. వనపర్తి జిల్లాలో 2,650 మంది ,  నారాయణపేటలో 5,026, గద్వాలలో 5,230 మంది, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  3,129 మందిని గుర్తించి అడ్మిషన్లు ఇచ్చారు.  మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో లాస్ట్ అకాడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బడిబాట నిర్వహించకపోయినా 26,173 మంది గవర్నమెంట్​ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేశారు. వారిలో 8,438 మంది ప్రైవేట్​ స్కూల్స్​నుంచి 17,735 ఇతర స్కూల్స్ నుంచి చేరారు. 


బడిబాట, టెన్త్​ స్పాట్ వాల్యూయేషన్​ ఒకే సారి


​‘బడిబాట’తో పాటు టెన్త్​ స్పాట్​ వాల్యుయేషన్​ను ఒకే టైంలో నిర్వహించారు. ఈ ప్రభావం బడిబాట మీద పడింది. జూన్​ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్పాట్​ వాల్యుయేషన్​ జరుగగా దాదాపు 1500 మంది టీచర్లు పాల్గొన్నారు.  ఆ తరువాత 13వ తేదీ నుంచి వీరు స్కూల్స్​కు హాజరయ్యారు. మిగతా టీచర్లకు బడిబాట బాధ్యతలు అప్పజెప్పారు.  అయితే, వీరిపై కాంప్లెక్స్​హెచ్​ఎంలు, ఎంఈవోల పర్యవేక్షణ లేకపోవడంతో అన్ని గ్రామాల్లో పర్యటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 15 మంది ఎంఈవోలు ఇన్​చార్జీలే ఉండటంతో బడిబాటను  సీరియస్​గా తీసుకోలేదని తెలుస్తోంది. 


ప్రైవేట్​ స్కూల్స్​కు స్టూడెంట్లు పెరుగుతున్నరు


నిరుడు   ప్రైవేట్​ నుంచి సర్కారు బడులకు అత్యధికంగా స్టూడెంట్లు అడ్మిషన్లు తీసుకున్నారు. కానీ, ఈ విద్యా సంవత్సరం సీన్​రివర్స్​ అయ్యింది.  గవర్నమెంట్​ స్కూల్స్​లో ఎక్కువగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో, స్టూడెంట్లు జాయిన్​అయ్యేందుకు ఇంట్రెస్ట్​ చూపడం లేదు. జిల్లాలోని ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు రెండు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు కూడా ముందుకు రావడం లేదు. అప్పు చేసైనా ప్రైవేట్​ స్కూళ్లల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


జులై ఫస్ట్ వీక్ వరకు అడ్మిషన్లు


బడిబాట ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ నెల 30 వరకు జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్లు తీసుకురావాలంటే యూడైస్ కంపల్సరీ చేయాల్సి ఉంది. ఆధార్ అప్డేట్ చేయాలి. లేకుంటే స్టూడెంట్లకు బుక్కులు, యూనిఫాం రావు. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా జూలై ఫస్ట్ వీక్ వరకు అడ్మిషన్లు జరుగుతాయి. 
- ఉషారాణి, డీఈవో, పాలమూరు