ఎన్నికల బరిలో కొత్త కూటమి: జనరల్ సెక్రటరీ కపిలవాయి దిలీప్ కుమార్

ఎన్నికల బరిలో కొత్త కూటమి: జనరల్ సెక్రటరీ కపిలవాయి దిలీప్ కుమార్

పద్మారావునగర్, వెలుగు: భావసారూప్యత కలిగిన 9 రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయని కూటమి సెక్రటరీ జనరల్ కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. కవాడిగూడ ఆర్‌‌ఎల్డీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీ బలహీనపడిందని, ‘బహుజనులకే రాజ్యాధికారం - మేమెంతో మాకంత’ నినాదంతో రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని వెల్లడించారు. కూటమి వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల ప్రదీప్ గౌడ్, రమావత్ లాలూ నాయక్, డేవిడ్ ఆండ్రూ, ఈడ శేషగిరి రావు, నారగోని తదితరులు పాల్గొన్నారు.