కోహ్లీ ఇన్స్‎స్టా గ్రామ్ అకౌంట్ మళ్లీ యాక్టివ్.. రాత్రికి రాత్రే అసలు ఏం జరిగింది..?

కోహ్లీ ఇన్స్‎స్టా గ్రామ్ అకౌంట్ మళ్లీ యాక్టివ్.. రాత్రికి రాత్రే అసలు ఏం జరిగింది..?

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్స్‎స్టా గ్రామ్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. కోహ్లీ ఇన్‎స్టా హ్యాండిల్ ఓపెన్ చేయగానే అకౌంట్ డిటెయిల్స్, ఫొటోస్, వీడియోస్ కనిపిస్తున్నాయి. దీంతో కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 274 మిలియన్ల ( దాదాపు 27 కోట్ల 40 లక్షలకు పైగా) ఫాలోవర్స్ ఉన్న విరాట్ ఇన్స్‎స్టా అకౌంట్ గురువారం (జనవరి 29) రాత్రి నుంచి డియాక్టివేట్ అయ్యింది. 

అకౌంట్‎ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే యూజర్‌ నాట్‌ ఫౌండ్‌ అంటూ మెసేజ్‌ దర్శనం ఇచ్చింది. దీంతో కోట్లాది మంది కోహ్లీ ఫాలోవర్స్, ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. కోహ్లీ ఇన్స్ స్టా అకౌంట్ ఓపెన్ కావడం లేదంటూ స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరికొందరు విరాట్ సతీమణి అనుష్క శర్మకు సోషల్ మీడియాలో మేసేజులు చేశారు. 

కోహ్లీ ఇన్స్ స్టా అకౌంట్‎కు ఏమైందంటూ ప్రశ్నించారు. విరాట్ కోహ్లీ ఇన్స్ స్టా గ్రామ్ డీయాక్టివేట్ టాపిక్ గంటల్లోనే సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. ఈ క్రమంలో శుక్రవారం (జనవరి 30) ఉదయం కోహ్లీ ఇన్స్ స్టా అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యింది. అయితే.. గురువారం (జనవరి 30) రాత్రి నుంచి విరాట్ ఇన్స్‎స్టా అకౌంట్ ఎందుకు డియాక్టివేట్ అయ్యిందనేది తెలియలేదు. 

కోహ్లీ గానీ ఇన్స్‎స్టా గ్రామ్ మాతృ సంస్థ మెటా గానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఇలా జరిగింది లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. కోహ్లీ లేదా మెటా స్పందిస్తేనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. మొత్తానికి విరాట్ ఇన్స్ స్టా అకౌంట్ మళ్లీ ఓపెన్ కావడంతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాస్ ఈస్ బ్యాక్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.