హైదరాబాద్: చత్తీస్‌గఢ్‌తో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–డి మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/56) చెలరేగాడు. రక్షణ్ రెడ్డి (2/28) కూడా అండగా నిలవడంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 283 రన్స్‌కే ఆలౌటైంది. ప్రతీక్ యాదవ్ (106), వికల్ప్ తివారీ (94) మినహా మిగతావారు ఫెయిలయ్యారు. ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆయుష్ పాండే (11), అనుజ్ తివారీ (4), సంజీత్ దేశాయ్ (1), అమన్‌దీప్ ఖరే (16), మయాంక్ వర్మ (3) విఫలమయ్యారు.
దాంతో చత్తీస్‌గఢ్ 58/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో వికల్ప్, ప్రతీక్ ఆరో వికెట్‌కు 183 రన్స్ జోడించారు. చివర్లో షాబాన్ ఖాన్ (20) మోస్తరుగా ఆడినా లోయర్ ఆర్డర్ నిరాశపర్చింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 56/0 స్కోరు చేసింది. అమన్ రావు (32 బ్యాటింగ్), అభిరత్ రెడ్డి (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ 227 రన్స్ వెనకబడి ఉంది.
