పాకిస్తాన్ వెళ్తున్నారా..అయితే జాగ్రత్త!.. తమ దేశ పౌరులను హెచ్చరించిన అమెరికా

పాకిస్తాన్ వెళ్తున్నారా..అయితే జాగ్రత్త!.. తమ దేశ పౌరులను హెచ్చరించిన అమెరికా
  • అక్కడ ఎలాంటి హెచ్చరిక లేకుండా టెర్రర్ ​అటాక్స్​ జరగవచ్చు

వాషింగ్టన్: పాకిస్తాన్‌కు ప్రయాణంపై పునరాలోచించుకోవాలని అమెరికా.. తమ దేశ పౌరులకు సూచించింది. అక్కడ ఎలాంటి హెచ్చరిక లేకుండా ఉగ్ర దాడులు జరగవచ్చని హెచ్చరించింది. క్రైమ్ , హింస, టెర్రరిజం, కిడ్నాప్ వంటి భద్రతా సమస్యలు ఉండొచ్చని వెల్లడించింది. 

రవాణా కేంద్రాలు, హోటళ్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక భద్రతా ప్రదేశాలు, విమానాశ్రయాలు, రైళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాలు, పర్యాటక ప్రదేశాలు ఎక్కడైనా ఆ బాంబు దాడులు జరగవచ్చని, ప్రయాణాలపై ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించింది. 

ఈ మేరకు ఈ వారం ప్రారంభంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్.. లెవల్​ 1 నుంచి లెవల్​ 4 వరకు ట్రావెల్​ అడ్వైజరీలను జారీ చేసింది. పాకిస్తాన్‌ను ‘లెవల్ 3’ కేటగిరీ కింద ఉంచింది. ఇది అధిక టెర్రర్​అటాక్​ల ప్రమాదాన్ని సూచిస్తుంది. 

బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాలను లెవల్ 4 కింద పేర్కొంది. ఆ ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించవద్దని అమెరికన్లను హెచ్చరించింది.