జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ను దుర్భాషలాడుతూ, చంపేస్తామని బెదిరించిన వ్యక్తులపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22న బోరబండ సైట్-1లోని ఆయన నివాసం ముందుకు గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి ఆయనను, కుటుంబ సభ్యులను అసభ్యకరంగా తిట్టడంతో పాటు చంపేస్తామని బెదిరించారు. దీంతో బాబా ఫసియుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
