కాకరాస్: చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు వెనిజులా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లుపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్ సంతకం చేశారు. ఇన్నాళ్లు చమురు రంగం వెనిజులా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. తాజాగా ఆయిల్ సెక్టార్లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇకపై చమురు రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు రానున్నాయి.
వెనిజులాను ఇటీవల అమెరికా ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. మిలిటరీ ఆపరేషన్ చేపట్టి ఆ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించాయి. ఇకపై వెనిజులాను తామే పాలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వెనిజులా చమురు రంగాన్ని కూడా తామే నియంత్రిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వాలని వెనిజులా తాత్కాలిక ప్రభుత్వంపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్ ఆయిల్ సెక్టార్లో ప్రైవేట్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇన్నాళ్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆయిల్ రిఫైనరీలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఇకపై అమెరికా కంపెనీలు వెనిజులా ఆయిల్ రంగాన్ని నియంత్రించనున్నాయి.
