భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ లో  కంట్రోల్ రూం ఏర్పాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మున్సిపల్​ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్​లో కంట్రోల్​రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ జితేష్​ వి.పాటిల్​గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలు, డబ్బులు, మద్యం పంపిణీతోపాటు ఇతర ఫిర్యాదులు చేసేందుకు 9381082501 నంబర్​కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కంట్రోల్​ రూం 24 గంటలు పనిచేస్తోందని వెల్లడించారు. 

ప్రతి ఫిర్యాదును రిజిస్టర్​లో నోట్ చేసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకే కంట్రోల్​ రూం ఏర్పాటు చేశామని తెలిపారు.