కాబోయే వాడిని లారీలో తీసుకెళ్లి యువతి నిశ్చితార్థం

కాబోయే వాడిని లారీలో తీసుకెళ్లి యువతి నిశ్చితార్థం

కేరళలోని త్రిసూర్‭లో అరుదైన ఘటన జరిగింది. ఓ యువతి నిశ్చాత్తార్థం చేసుకునే యువకుడిని లారీలో తీసుకెళ్లింది. తానే స్వయంగా లారీ నడుపుకుంటూ అతడిని చర్చికి తీసుకెళ్లి నిశ్చితార్థ వేడుక చేసుకుంది. ఇది చూసి అక్కడికి వచ్చిన బంధువులంతా ఆశ్చర్యపోయారు. 

త్రిసూర్ జిల్లాలోని మానలూరుకు చెందిన  దలీషా అనే యువతికి చిన్నప్పటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి డేవీస్ కూడా లారీ డ్రైవర్ కావడంతో తన ఇష్టాన్ని మరింత పెంచుకుంది. అప్పుడప్పుడు తన తండ్రి లేకుండానే లారీ డ్రైవింగ్ చేస్తూ.. కొచ్చి నుంచి పెట్రోల్ తెచ్చి మలక్‭పురం బంక్‭కు సరఫరా చేసేది. అ సమయంలో ఆమె లారీ డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమెకు గల్ఫ్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. గల్ఫ్‭లో ట్యాంకర్ డ్రైవర్‭గా చేరిన సమయంలో జిల్లాలోని కంజీరాపల్లికి చెందిన డ్రైవర్ హన్సన్‭తో యువతికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారడంతో ఇరువురు కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో సెయింట్ ఆంథోని చర్చిలో నిశ్చితార్థ వేడుకకు ఏర్పాట్లు చేశారు. దీంతో కాస్త ప్రత్యేకంగా ఆలోచించిన దలీషా యువకుడిని లారీలో తీసుకెళ్లి నిశ్చితార్థం చేసుకుంది.