
బైకు పై వెళ్తున్న నవ దంపతులపై ఆయిల్ డ్రమ్ము పడడంతో నవ వరుడు శ్రీనివాస్ 30 మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని నంద్యాల మహానంది నుండి గిద్దలూరు వెళ్లే ఘాట్ రోడ్డులో జరిగింది. కొత్తగా పెళ్లైన దంపతులు మహనందీశ్వరుడిని దర్శించుకొని బైక్ పై వస్తుండగా.. అదే సమయంలో ఘాట్ రోడ్డులో రెండు లారీలు ఢీకొని.. లారీలోని ఆయిల్ డ్రమ్ములు వారిపై పడ్డాయి. పచ్చర్లా ఘాట్ లో సర్వ నర్సింహ స్వామి టేంపుల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యను స్థానికులు నంధ్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.