హైదరాబాద్, వెలుగు: భారత ప్రభుత్వ తాజాగా విడుదల చేసిన నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టాండర్డ్స్ (ఎన్‌బీసీఎస్) 2026 రూల్స్‌ను హెల్త్‌కేర్ ఫెడరేషన్ నాట్‌హెల్త్ స్వాగతించింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, ఆసుపత్రుల ఎత్తు ఇక నుంచి 45 మీటర్లకు (సుమారు 12–15 ఫ్లోర్లు) మించి ఉండొచ్చు. ఐసీయూలను కూడా 45 మీటర్లకు మించి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కఠినమైన ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరి.
పట్టణ ప్రాంతాల్లో భూమి ఖర్చులు, బెడ్లు పరిమితంగా ఉండడం, మౌలిక వసతుల తక్కువ వినియోగం వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని తగ్గించడంలో ఎన్‌బీసీఎస్ రూల్స్ సాయపడతాయి. ఈ సంస్కరణలు ‘స్వస్థ భారత్ నుంచి వికసిత భారత్’ దిశగా ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నాట్‌హెల్త్ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి అన్నారు. ఫ్యూచర్ రెడీ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాను డెవలప్ చేయడంలో ఇవి కీలకమన్నారు.
