
బెంగళూరు: ర్యాపిడో రైడ్ బుక్ చేసుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాష్ డ్రైవింగ్ విషయంలో ర్యాపిడో డ్రైవర్‌తో గొడవ పడటంతో యువతిపై అతడు దాడికి దిగాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు జయనగర్‌లోని బంగారు ఆభరణాల దుకాణంలో సేల్స్ వుమెన్‌గా పని చేస్తున్న యువతి అక్కడికి వెళ్లడానికి ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది.
డ్రైవర్ వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడని ఆరోపిస్తూ మధ్యలోనే ఆమె వాహనం దిగి అతడితో గొడవ పడింది. యువతి హెల్మెట్ చార్జీ చెల్లించడానికి, హెల్మెట్‌ను తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించింది. దీంతో కోపానికి గురైన డ్రైవర్ యువతిపై దాడి చేయడంతో ఆమె కిందపడిపోయింది.
కాగా, ఈ ఘటనకు సంబంధించి మరో వీడియో ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. అందులో ర్యాపిడో డ్రైవర్ పై యువతి పలుమార్లు చేయిచేసుకోవడం కనిపించింది. పదే పదే చెంపపై కొట్టడంతో సహనం కోల్పోయిన ర్యాపిడో డ్రైవర్ తిరిగి చేయిచేసుకున్నట్లు సమాచారం. యువతి ఫిర్యాదు చేయడానికి నిరాకరించిందని పోలీసులు తెలిపారు.