మరో 6 వారాల్లో ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. ఆమె ఎవరంటే

మరో 6 వారాల్లో ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. ఆమె ఎవరంటే

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం వెలువరించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్టు ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ సీఈవోగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత.. తాను చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీఓ), ప్రొడక్ట్, సాఫ్ట్ వేర్ విభాగాల బాధ్యతలను చూసుకోనున్నట్టు మస్క్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ కొత్త సీఈవో ఎవరన్న దానిపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ కొత్తగా వచ్చేది ఎవరో, ఆమె ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అందర్లోనూ చర్చ మొదలైంది.

మస్క్ కొత్త సీఈవో వివరాలు వెల్లడించకపోయినప్పటికీ కొత్త సీఈవోపై కొన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. లిండా యాకారినో అనే మహిళ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపడతారని టాక్ వినిపిస్తోంది. ఆమె ప్రస్తుతం NBCU అడ్వర్టైజింగ్ హెడ్ గా కొనసాగుతున్నారు. ఇటీవల యాకారినో మయామిలో "Possible" పేరుతో నిర్వహించిన అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్ ఎలోన్ మస్క్‌తో ఒక సెషన్‌ను నిర్వహించింది. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్ 2024 కవరేజీ కోసం NBCతో ట్విట్టర్ భాగస్వామ్యంపై ఆమె పలు ట్వీట్లు చేశారు. దీంతో ఆమె పేరు తెరపైకి వచ్చింది.

https://twitter.com/elonmusk/status/1656748197308674048