బిగ్ బాస్ సీజన్ 7లో ట్విస్ట్.. నాగార్జున చెప్పిన ఉల్టా పుల్టా ఇదేనా?

బిగ్ బాస్ సీజన్ 7లో ట్విస్ట్.. నాగార్జున చెప్పిన ఉల్టా పుల్టా ఇదేనా?

బిగ్‌బాస్‌ సీజన్ 7(Bigg boss seeson7)లో శనివారం రోజు జరిగిన ఎపిసోడ్‌లో విశ్వరూపం చూపించాడు హోస్ట్ నాగార్జున(Nagarjuna). వీడియో ప్రూఫ్స్ చూపిస్తూ ఒక్కొక్కరిని కడిగిపారేసాడు. దీంతో హౌస్‌లో వాతావరణం మొత్తం ఒక్కసారి సీరియస్‌ గా మారింది. ఆడియన్స్ కూడా ఈ ఎపిసోడ్ ను చాలా ఎంజాయ్ చేశారు. 

ఈ హీట్ ఇంకా కొనసాగుతుండగానే.. సండే ఫన్ డే తో రెడీ అయిపోయాడు నాగార్జున. దీనికి సంబందించిన ప్రోమో కూడా వచ్చేసింది. ఇక ప్రోమో చివర్లో ఓ సర్‌ప్రైజ్‌ అంటూ షాకిచ్చాడు నాగ్. ఇప్పటివరకు ఎప్పుడూ, ఎక్కడా జరగనటువంటి విషయాలు జరగబోతున్నాయి. ఈ సీజన్‌ ఉల్టా పుల్టా అనే విషయం గుర్తుంచుకోండి అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. దీంతో ఆ ట్విస్ట్ ఏమైఉంటుంది అని బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు ఆడియన్స్.

అయితే.. నాగార్జున స్పెషల్ గా మెన్షన్ చేసిన ఆ సర్‌ప్రైజ్‌ ఏంటంటే.. మరో వారం రోజుల్లో బిగ్‌బాస్‌ 7లో రెండో లాంచ్‌ జరుగనుందట. అంటే.. మరికొంతమంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని. అందులో.. భోలె షావళి, అంజలి పవన్‌, పూజా మూర్తి, నయని పావని, అంబటి అర్జున్‌ ఉండనున్నారని సమాచారం.  

ఇక ఈ సీజన్ మొదలై దాదాపు నెల రోజులు గడుస్తోంది. ఈ సమయంలో కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపడడాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? కొత్త కంటెస్టెంట్లు ఇంట్లోవారితో ఎలా కలిసిపోతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి బిగ్ బాస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది రానున్న రోజుల్లో తెలియనుంది.