14 దేశాల్లో విస్తరించిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్

14 దేశాల్లో విస్తరించిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్
బ్రిటన్ లో మొదలైన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆ దేశంలో ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. మామూలు కరోనా కంటే 70 శాతం ఎక్కువ వేగంతో ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు దేశాలు వైరస్ తమ దేశంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పటికే పలు దేశాల్లోకి కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, డెన్మార్క్, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జపాన్, లెబనాన్, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇండియా దేశాల్లోకి కొత్త స్ట్రెయిన్ వ్యాపించినట్ల నిర్ధారించారు. UK నుంచి భారత్ కు వచ్చిన వారిలో కరోనా సోకిన వారిని గుర్తించి… వారి శాంపుల్స్ ని పరీక్షించగా వారిలో ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. దీంతో… వైద్య శాఖాధికారులు అలర్ట్ అయ్యారు. కొత్త స్ట్రెయిన్ కలిగిన వ్యక్తులకు కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.