
- తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం
హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన పాలకమండలి ఉన్నత స్థాయి సమావేశంలో బీఏలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కోర్సు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సు ను ప్రవేశ పెట్టాలని తీర్మాణం చేశారు.
బీఏ డిగ్రీ కోర్సులో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కోర్సు ప్రవేశపెడుతున్నామని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. తెలంగాణ సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సును అందిచాలని నిర్ణయం తీసుకున్నారు.