విజృంభిస్తున్న కరోనా న్యూ వేరియంట్.. ఆందోళన చెందుతున్న పబ్లిక్

విజృంభిస్తున్న కరోనా న్యూ వేరియంట్.. ఆందోళన చెందుతున్న పబ్లిక్

కొవిడ్ కల్లోలం సృష్టించిన వినాశనం మరవక ముందే దాని ప్రతిరూపాలు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. కొవిడ్ కి చెందిన మరో కొత్త వేరియంట్ వ్యాపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దానికి 'పిరోలాస(BA.2.86)' అని పేరు పెట్టారు. 

ఇది ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్ అని అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... పిరోలా కేసులు ప్రపంచ దేశాలను చుట్టు ముడుతున్నాయి. తక్కువ టైంలోనే చాలా దేశాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

ఈ వేరియంట్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ అండర్ మానిటరింగ్ గా వర్గీకరించింది. సాధారణ రకంతో పోలిస్తే ఇది 36 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలు కలిగి ఉందని చెప్పింది. డెన్మార్క్, స్వీడన్, ఇజ్రాయెల్,యూకే, దక్షిణాఫ్రికా, నార్వే, కెనడా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో ఈ వేరియంట్ సోకిన కేసులు న‌మోద‌య్యాయి. 

దీని వ్యాప్తి, మానవ శరీరంపై ప్రభావం తదితర అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని ఈజీగా తప్పించుకోగలవని నిపుణులు అంటున్నారు. కొత్త వేరియంట్ కొవిడ్ టీకాలు తీసుకున్న వారికీ సోకుతోంది. ఇంకా ఈ మ్యుటేషన్ వ్యాప్తిపై పరిశోధనలు జరగాల్సి ఉందని యూఎస్ వైద్యులు వెల్లడించారు.