
జూలై 1 నుంచి కొత్త డెబిట్ కార్డు రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కస్టమర్ల భద్రతే లక్ష్యంగా ఆర్బీఐ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. న్యూ రూల్స్ ప్రకారం ఆన్లైన్ వ్యాపారులు కస్టమర్ వివరాలను స్టోర్ చేయకూడదు. ఈ రూల్స్ ను కంపెనీలు జూలై 1 నుంచి అమలు చేయనున్నాయి. దీంతో కస్టమర్లు సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు చేసుకునేందుకు వీలుంటుంది. దేశీయ ఆన్లైన్ కొనుగోళ కోసం ఆర్బీఐ కార్డ్ ఆన్ ఫైల్ టోకెన్ విధానాన్ని తప్పనిసరి చేసింది.
కార్డ్ ఆన్ ఫైల్ విధానంలో డెబిట్ కార్డు వివరాలను ఎన్క్రిప్టెడ్ టోకెన్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఈ టోకెన్ల సాయంతో కస్టమర్లు కార్డు వివరాలను వెల్లడించకుండానే ఆన్లైన్ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఒరిజినల్ కార్డు డేటా స్థానంలో ఎన్ క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్ ను తీసుకోవాలి. దీనిని సంబంధించిన గడువును జనవరి 1 నుండి జూలై 1కి పొడగించింది ఆర్బీఐ. దీంతో జూలై 1 నుండి వ్యాపారులు తమ రికార్డుల నుండి కస్టమర్ల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటాను తొలగించాల్సి ఉంటుంది. అయితే కార్టు టోకనైజేషన్ సిస్టమ్ తప్పనిసరి కాదు. కావాలనుకుంటే కస్లమర్లు కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవొచ్చు. కేవలం దేశీయ ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే టోకనైజేషన్ వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డు యాక్టివేషన్ కొత్త రూల్స్..
ఇక క్రెడిట్ కార్డు యాక్టివేషన్ కు సంబంధించిన కొత్త రూల్స్ అమలుకు ఆర్బీఐ గడువు పొడగించింది. జూలై 1 నుండి అమలుకావాల్సి ఉండగా దానిని అక్టోబర్ 1 వరకు పొడగించింది. కార్డు జారీ చేసిన 30రోజులకు పైగా కస్టమర్ యాక్టివేట్ చేసుకోకపోతే, జారీ చేసిన కంపెనీలే కార్డును యాక్టివేట్ చేయడానికి ఒక ఓటీపీని పంపిస్తాయి. ఆ ఓటీపీని కస్టమర్ చెప్పగానే కంపెనీలే వాటిని యాక్టివేట్ చేస్తాయి. అయితే కస్టమర్ ఓటీపీ చెప్పకపోతే ఆ అకౌంట్ ను క్లోజ్ చేయనున్నారు. ఈ రూల్ ను జూలై 1 నుండే తీసుకరావాలనుకున్నా బ్యాంకుల నుండి వచ్చిన వినతులతో ఆర్బీఐ మరో మూడునెలలు పొడగించింది.