ఆదిపురుష్ థియేటర్స్లో హనుమంతుడి కోసం సీటు.. ఏం నమ్మకం ఇచ్చావయ్యా!

ఆదిపురుష్ థియేటర్స్లో హనుమంతుడి కోసం సీటు.. ఏం నమ్మకం ఇచ్చావయ్యా!

ఆదిపురుష్ టీమ్ మరో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. హిందువులకు హనుమంతుడు అంటే ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు భయమేసిన, ధైర్యాన్ని కోల్పోయినా ఆంజనేయ శ్లోకమే చదువుతారు. ఆ నమ్మకంతోనే ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్ లో ఒక సీట్ ను హనుమంతునికి కేటాయించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

Also Read:రాష్ట్రం వచ్చాకే కోతల్లేని కరెంట్​

”రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు ఉంటాడనేది భారతీయుల నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ.. ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా టెలికాస్ట్ అవనున్న ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం ఆదిపురుష్ మేకర్స్. ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీగా రానున్న “ఆదిపురుష్” సినిమాను హనుమంతుడి సమక్షంలో వీక్షిద్దాం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.