
హైదరాబాద్, వెలుగు: క్విక్ రెస్టారెంట్చెయిన్ కేఎఫ్‌సీ వేసవి సందర్భంగా కొత్త డ్రింక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఇండియన్ మసాలా , నిమ్మకాయ రుచులను అందించే క్లాసిక్ క్రష్ లైమ్‌తోపాటు మింట్ రుచులను ఆస్వాదించే వినియోగదారుల కోసం వర్జిన్ మోజిటో ఉంది.
నిమ్మకాయ, చిక్కని పుదీనా ఫ్లేవర్లు ఇందులో ఉంటాయి. మూడోది మసాలా పెప్సీ కాగా, చివరిది, మౌంటైన్ డ్యూ మోజిటో. వీటి ధరలు రూ.59 నుంచి మొదలవుతాయి. తమ అన్ని రెస్టారెంట్లలో ఈ డ్రింక్స్లభిస్తాయని కేఎఫ్‌సీ తెలిపింది.