రూ.60 కోట్లతో ఎన్‌‌‌‌కోర్‌‌‌‌-ఆల్కమ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌

రూ.60 కోట్లతో ఎన్‌‌‌‌కోర్‌‌‌‌-ఆల్కమ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌

 హైదరాబాద్‌‌‌‌, వెలుగు : అల్యూమినియం డోర్స్‌‌‌‌, విండోస్‌‌‌‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌‌‌‌ కంపెనీ ఎన్‌‌‌‌కోర్‌‌‌‌- ఆల్కమ్‌‌‌‌ గుజరాత్‌‌‌‌లోని సూరత్‌‌‌‌ వద్ద  అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. ఈ ప్లాంటు కోసం కంపెనీ సుమారు రూ.60 కోట్లు వెచ్చిస్తోంది. అల్యూమినియం డోర్స్‌‌‌‌, విండోస్‌‌‌‌ విభాగంలో భారత్‌‌‌‌లో తొలి ఆటో రోబోటిక్‌‌‌‌ ఫెసిలిటీ ఇదేనని సంస్థ  ఎన్‌‌‌‌కోర్‌‌‌‌-ఆల్కమ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌, సీఎండీ అవుతు శివ కోటి రెడ్డి తెలిపారు. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30వేల చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా ఈ కేంద్రం సిద్ధం అవుతుందని చెప్పారు.  కొత్త ప్లాంటుతో 180 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.