డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న కొత్త మూవీ.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌ లాంచ్

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న కొత్త మూవీ.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌ లాంచ్

అనురాగ్‌‌‌‌, సంతోష్‌‌‌‌, సాయి విక్రాంత్ లీడ్ రోల్స్‌‌‌‌లో టీడీ ప్రసాద్ వర్మ  దర్శకుడిగా  హ‌‌‌‌న్ శివ్ ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  ఎన్‌‌‌‌.మ‌‌‌‌హేశ్వరి, పి.జ్యోతి  కొత్త  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, నటుడు అలీ కెమెరా స్విచాన్ చేశారు. ఎస్వీ కృష్ణా రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టీడీ ప్రసాద్ వర్మ మాట్లాడుతూ ‘విభిన్న  క‌‌‌‌థాంశంతో  ఈ చిత్రాన్ని   ప్రేక్షకుల‌‌‌‌ ముందుకు తీసుకురాబోతున్నాం. .

అలీ గారు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌డేట్స్ తెలియజేస్తాం’ అని అన్నాడు.  ఇందులో విలక్షణమైన పాత్రతో ఆడియెన్స్‌‌‌‌ను అలరిస్తానని నటుడు అనురాగ్ చెప్పాడు. తమ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో రానున్న  తొలి సినిమాను అందరూ సపోర్ట్ చేయాలని నిర్మాతలు కోరారు.  అలీ, చ‌‌‌‌మ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్‌‌‌‌, ఫ‌‌‌‌ణి, వినీత రెడ్డి ఈ  చిత్రంలో నటిస్తున్నారు.