సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ విభాగంలో కొత్త పరికరాలు

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ విభాగంలో కొత్త పరికరాలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ డిపార్ట్ మెంట్  కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఓపీ భవనంలో రెనోవేషన్ ​చేసిన ఫిజియోథెరపీ రూమ్ లను  బుధవారం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి.హెచ్. రాజకుమారి ప్రారంభించారు. ఫిజియోథెరపీ డిపార్ట్ మెంట్ ను  ఆధునీకరించేందుకు సహకారం అందించిన అర్పన్, రోగి సహాయత ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆమె అభినందించారు.

 న్యూరో, ఆర్థో, సర్జరీ, గైనిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యుల సిఫారసులతో వచ్చే రోగులకు ఇక్కడ ఆధునిక పద్ధతిలో ఫిజియోథెరపీ నిర్వహించనున్నట్లు చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబోధ్ కుమార్, ఆర్థోపెడిక్ హెచ్ఓడీ డాక్టర్ బి. వాల్యా, ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, ఫిజియోథెరపిస్టులు రమేశ్, సంతోష్​, అర్పన్ సంస్థ ప్రతినిధులు పరిమల్ పారిక్, చందూభాయ్, హితేంద్ర, అనిత, మయాంక్, సుధీర్, ప్రేమల్, రోగి సహాయత ట్రస్ట్ ప్రతినిధులు దేవేందర్ మెహతా, వీణ, విమల, సునీత, గీత, సంగీత, రంజన్, సోషల్ వర్కర్ జీ.పవన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.