లేబర్ కోడ్స్‌‌తో గిగ్‌‌వర్కర్ల బాధ్యత.. స్విగ్గీ, జొమాటోదే

లేబర్ కోడ్స్‌‌తో గిగ్‌‌వర్కర్ల బాధ్యత.. స్విగ్గీ, జొమాటోదే
  •   ఆరోగ్య బీమా, పెన్షన్ వంటివి ఇచ్చేందుకు ఫండ్ ఏర్పాటు చేయనున్న డెలివరీ కంపెనీలు

న్యూఢిల్లీ:  గిగ్‌‌వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే నాలుగు లేబర్‌‌‌‌ కోడ్‌‌లు తాజాగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.  ఈ చట్టాల ప్రకారం, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు తమ డెలివరీ పార్టనర్లను  కాంట్రాక్ట్ ఉద్యోగిగా చూడడానికి అవ్వదు. వీరికి సామాజిక భద్రత కల్పించే బాధ్యత ఇక నుంచి వీటిపై పడింది.
డెలివరీ కంపెనీలు చేయాల్సినవి..

సోషల్ సెక్యూరిటీ కోడ్‌‌ ప్రకారం, స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌‌లో 1–2శాతం అమౌంట్‌‌ను తాము నియమించుకున్న గిగ్‌‌వర్కర్ల సోషల్ సెక్యూరిటీ కోసం ఖర్చు చేయాలి. ‌‌ తమ గిగ్ వర్కర్లకు చెల్లిస్తున్న మొత్తంలో 5శాతానికి ఇది  పరిమితం. గిగ్‌‌వర్కర్లకు పీఎఫ్‌‌,  ఆరోగ్య,  ప్రమాద బీమా, వృద్ధాప్య పెన్షన్ వంటి ప్రయోజనాలు అందివ్వాలి.

అమలు విధానం..

కంపెనీలు ఒక వెల్ఫేర్‌‌‌‌ ఫండ్‌‌ను ఏర్పాటు చేయాలి. దీనిని తరచూ ఆడిట్ చేయాలి. తమ  వార్షిక టర్నోవర్‌‌‌‌లో 1–2 శాతాన్ని ఈ ఫండ్‌‌కి ఇవ్వాలి. గిగ్ వర్కర్లందరినీ ఆధార్ ఆధారిత యూనివర్సల్ అకౌంట్ నంబర్‌‌తో నమోదు చేయాలి. వీరికి కూడా చట్టబద్ధంగా కనీస వేతనం అందివ్వాలి. అంతేకాకుండా  కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించాలి.