యూట్యూబ్‌ లో కొత్త ఫీచర్‌

యూట్యూబ్‌ లో కొత్త ఫీచర్‌

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌‌‌‌కు సంబంధించి ఒక డివైజ్‌పై ఒకటే ప్రొఫైల్‌‌‌‌ ఉంటుంది. ఒకే అకౌంట్‌ ద్వారా రెండింటినీ యాక్సెస్‌ చేయొచ్చు. అయితే యూట్యూబ్‌ మ్యూజిక్‌‌‌‌ యాప్‌ ప్రత్యేకంగా మ్యూజిక్‌‌‌‌ను ఎంజాయ్‌ చేసేవాళ్లకోసమే. కానీ, యూజర్స్‌‌‌‌ ఈ రెండింటినీ వాడటం వల్ల చిన్న ఇబ్బంది ఉంది. ఒకే ప్రొఫైల్‌‌‌‌ అవ్వడం వల్ల యూట్యూబ్‌ యాప్‌లో ఒక వీడియోను లైక్‌‌‌‌ చేస్తే, అది మ్యూజిక్‌‌‌‌ యాప్‌లో కూడా కనిపిస్తుంది. దీనివల్ల మ్యూజిక్‌‌‌‌ వీడియోలో లైక్‌‌‌‌ చేసిన వీడియోలు కూడా కలిసిపోతుంటాయి. కానీ, ఇకపై ఈ ప్రాబ్లమ్‌ రాకుండా కొత్త అప్‌ డేట్‌ తీసుకొచ్చింది యూట్యూబ్‌. ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ ద్వారా యూట్యూబ్‌ మెయిన్‌‌‌‌ యాప్‌, మ్యూజిక్‌‌‌‌ యాప్‌.. రెండింటిలోనూ లైక్డ్‌ వీడియోస్‌ సెపరేట్‌గా ఉంటాయి. మెయిన్‌‌‌‌ యాప్‌లోని లైక్డ్‌ వీడియోస్‌ను మ్యూజిక్‌‌‌‌ యాప్‌లోనే హైడ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల యూజర్స్‌‌‌‌ తమ మ్యూజిక్‌‌‌‌ యాప్‌ లైబ్రరీలో లైక్‌‌‌‌ చేసిన
మ్యూజిక్‌‌‌‌ వీడియోస్‌ను మాత్రమే చూడొచ్చు. సెట్టింగ్స్‌‌‌‌లోకి వెళ్లి, ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ను యూట్యూబ్‌ అప్‌ డేట్‌ చేసినప్పటికీ, అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త టైమ్‌ పట్టొచ్చు.

For More News..

రైతు వేదికలకు కాదు.. పంట నష్టానికి పైసలియ్యాలె

కొత్త ధరణిలో పాత పేర్లు.. అమ్మిన భూమిని మళ్లీ అమ్మేందుకు యత్నాలు

అధికారులు.. మా మాట వినాల్సిందే