వాట్సాప్ బిజినెస్‌‌ అకౌంట్లో కొత్త ఫీచర్‌‌‌‌

వాట్సాప్ బిజినెస్‌‌ అకౌంట్లో కొత్త ఫీచర్‌‌‌‌

న్యూఢిల్లీ: బిజినెస్ అకౌంట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌‌‌‌ను తీసుకొచ్చింది. మెసేజ్‌‌లను సెర్చ్‌‌  చేయడానికి అడ్వాన్స్డ్‌‌ సెర్చ్ ఫిల్టర్‌‌‌‌ను యాడ్ చేసింది.  కాంటాక్ట్స్‌‌, నాన్‌‌ కాంటాక్ట్స్‌‌, అన్‌‌రీడ్ వంటి మూడు కేటగిరీల కింద మెసేజ్‌‌లను ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా వెతుక్కోవచ్చు. అండ్రాయిడ్‌‌తో పాటు, ఐఓఎస్‌‌ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

‘వాట్సాప్ మెసెంజర్‌‌‌‌కు ఈ ఫీచర్‌‌‌‌ను యాడ్ చేయాలనుకుకోవడం లేదు. ఈ ఫీచర్ ఎక్కువగా వాట్సాప్ బిజినెస్‌‌ అకౌంట్లకు ఉపయోగపడుతుంది’ అని డబ్ల్యూఏ బెటాఇన్ఫో పేర్కొంది. ‘వాట్సాప్ తీసుకొచ్చిన అడ్వాన్స్డ్‌‌ సెర్చ్ ఫిల్టర్స్‌‌ వల్ల చాట్‌‌లను, మెసేజ్‌‌లను ఫిల్టర్‌‌‌‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆన్‌‌లో ఉంటే కాంటాక్ట్స్‌‌, నాన్‌‌–కాంటాక్ట్స్‌‌, అన్‌‌రీడ్‌‌ అని కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి’ అని వివరించింది. ఈ ఆప్షన్లను వాడేటప్పుడు ఇతర ఆప్షన్లను  కంబైన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కాంటాక్ట్‌‌ పంపిన ఫొటోలను వెతకాలంటే, కాంటాక్ట్‌‌ ఆప్షన్‌‌తో పాటు ఫొటో అనే ఆప్షన్‌‌ను క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ నుంచి వచ్చిన లేదా పంపిన ఫొటోలు కనిపిస్తాయి.