హెయిర్ కటింగ్ ఛార్జ్ రూ. లక్షా 15 వేలు.. డబ్బులు లేవంటే అప్పు కూడా వాళ్లే ఇచ్చారు

హెయిర్ కటింగ్ ఛార్జ్ రూ. లక్షా 15 వేలు.. డబ్బులు లేవంటే అప్పు కూడా వాళ్లే ఇచ్చారు

సోషల్ మీడియా వచ్చాక చాలా మంది మోసగాళ్లకు మోసం చేయడం చాలా సులభమైంది. పలు ఆఫర్లు, డిస్కౌంట్లు అని చెప్పి డబ్బు కాజేయడం షరా మామూలైంది. అదే తరహాలో చైనాకు చెందిన ఓ వ్యక్తి రూ.1.15లక్షల సెలూన్ బిల్లు చెల్లించేందుకు రుణం తీసుకోవల్సి వచ్చింది. హెయిర్ కట్ కోసం బీజిక్సింగ్ హెయిల్ సెలూన్ ను సందర్శించిన ఆ వ్యక్తి.. అప్పు తీసుకున్న తర్వాత వారి మోసాన్ని గ్రహించి అవాక్కయ్యాడు.

హెయిర్ సెలూన్ లో రూ.230కి బదులుగా రూ.1.15 లక్షలు చెల్లించాలని, అందుకు లోన్ తీసుకోవాలని వ్యక్తిని నిర్వాహకులు బలవంతం చేశారు. అవును మీరు విన్నది నిజమే.. లీ అనే పేరు గల ఓ వ్యక్తి తన స్నేహితుడి నుంచి రూ.230 విలువైన బీజిక్సింగ్ హెయిర్ సెలూన్ గిఫ్ట్ కార్డ్ ను పొందాడు. తూర్పు చైనాలోని బెజియాంగ్ ఫ్రావిన్స్ లోని హాంగ్ జౌకు చెందిన రెస్టారెంట్ వర్కర్ వోచర్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సెలూన్ కు వెళ్లి వోచర్ ను ఉద్యోగులకు చూపించగా.. వారు తన తలకు మసాజ్ చేస్తామని చెప్పారు.

ఆ తర్వాత ఓ ఉద్యోగి లీ ముఖంపై స్కిన్ లోషన్ రాశాడు. ఒక్కో లోషన్ బాటిల్ విలువ రూ.4వేల 582 అని తెలిపాడు. వెంటనే ఆ లీ సెలూన్ మేనేజర్ ను సంప్రదించారు. వారు ఇతర అదనపు ప్రయోజనాలను పొందేందుకు రూ.57వేల 571 విలువైన మరో గిఫ్ట్ కార్డుని కొనుగోలు చేయమని మేనేజర్ లీని ప్రోత్సహించారు. ఆ తర్వాతే ఆ వ్యక్తికి హెయిర్ కట్ చేయడానికి ముందుకు వచ్చారు. అతని హెయిర్ కట్ కు ముందు వారు లీకి ధరల జాబితాను కూడా చూపించారు. కానీ లీ కళ్లజోడు ధరించకపోవడంతో ధరలను చూడలేకపోయాడు.

హెయిర్ కట్ ముగిశాక రూ.1.15లక్షల బిల్లును చూసి లీ షాకయ్యాడు. లీ వెంటనే తన వద్ద అంత డబ్బు లేదని సెలూన్ ఉద్యోగులతో చెప్పాడు. అప్పుడు వారు లీకి ఓ ప్లాన్ చెప్పారు. తక్షణమే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని వారు లీకి సూచించారు. తాను ఎదుర్కొన్న ఈ సంఘటనను గుర్తు చేసుకున్న లీ.. తన లాగే చాలా మంది లోన్ తీసుకునేందుకు దరఖాస్తు చేయమని బలవంతం చేశారని తెలిపాడు. ఓ వ్యక్తి తన ఫోన్ ను తీసుకెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. తాను కోల్పోయిన డబ్బును పొందుతానన్న నమ్మకంతో లీ.. స్థానిక టీవీ నెట్ వర్క్ ను కూడా సంప్రదించాడు. ఈ ఘటన జరిగినప్పట్నుంచి ఆ సెలూన్ ను మూసివేశారని నివేదికల ప్రకారం తెలుస్తోంది.