
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో సీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..డ్రగ్స్ ను వినియోగించినా.. ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్స్, బార్ల దగ్గర డ్రగ్స్ విక్రయించే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశాంచారని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు..
చట్టాలను గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందన్నారు సీపీ. సినీ రంగంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని.. డ్రగ్స్ నివారణకు పబ్స్, ఫాంహౌజ్ ఓనర్లు సహకరించాలని.. ఎలాంటి డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి.