
వనపర్తి టౌన్, వెలుగు: ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టూడెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ ఆన్ లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టూడెంట్లకు నీట్, జేఈఈ, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ ఆన్‌లైన్‌లో ఫ్రీ కోచింగ్ క్లాసులు ప్రారంభమైనట్లు ఆయన వివరించారు.
బైపీసీ విద్యార్థులకు నీట్ కు సంబంధించిన తరగతులు, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ కి సంబంధించిన తరగతులు, ఆర్ట్స్ విద్యార్థులకు క్లాట్ క్లాసులు ఆన్ లైన్ లో ప్రారంభమైనట్లు తెలిపారు. జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ గా జరిగే తరగతులతోపాటు ఫ్రీ ఆన్‌లైన్ క్లాసులు ప్రతిరోజు ఇంటర్ బోర్డు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారని తెలిపారు.