
ఘట్కేసర్, వెలుగు: ఓ ఇంటి యజమానిని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిన ఇద్దరు విలేకరులతో పాటు ఓ యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ, ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన పడకంటి నర్సింహ్మచారి జగదాంబ థియేటర్ సమీపంలో ఓ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. ఆయన వద్దకు ఓ పేపర్, ఓ చానల్లో రిపోర్టర్లుగా పనిచేస్తున్న కార్తీక్, వేణు, యూట్యూబర్ సుందర్ వచ్చి అనుమతులు లేకుండా భవనం ఎలా కడుతున్నావని బెదిరించారు.
తాము 8 మంది ఉన్నామని, తలా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అధికారులకు చెప్పి భవనం కూల్చివేయిస్తామని హెచ్చరించారు. దీంతో యజమాని బుధవారం సాయత్రం పోలీసులను ఆశ్రయించారు. వారు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.