నిజామాబాద్ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ చట్టాలతో కార్మికులు హక్కులు కోల్పోతారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్ జిల్లాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారత రాజ్యాంగంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొత్త లేబర్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సబ్బని లత, అరుణ, జగదీశ్, గంగాశంకర్ పాల్గొన్నారు.
