గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే పాయల్ శంకర్

 గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :  ఎమ్మెల్యే పాయల్ శంకర్
  • పాయల్​ శంకర్ ​ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ అన్నారు. సోమవారం అదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామ పటేల్ పురుషోత్తం, భీం రావుతో పలువురు నేతలు, గ్రామస్తులు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

పంచాయితీ ఎన్నికల్లో  బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. నాయకులు స్వామి, అశోక్, ముకుంద తదితరులు పాల్గొన్నారు.