
రాష్ట్ర రవాణా శాఖ ఆదాయంలో దేశంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోందని హైదరాబాద్ లో చెప్పారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఈ మధ్య RTAలో కార్డ్స్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయన్నారు. 5వేల రిబ్బన్స్ అవసరం ఉంటే 2 వేలు మాత్రమే అందించారని చెప్పారు. 2లక్షల 30వేల కార్డ్స్ ప్రింటింగ్స్ చెయ్యాల్సి ఉందనీ.. రాబోయే 15 రోజుల్లో ప్రింటింగ్ చేయించి ఇస్తామని చెప్పారు.
రవాణా శాఖలో మరిన్ని మార్పులు త్వరలోనే తెస్తామన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రవాణా శాఖపై కమిటీ వేస్తున్నామనీ… 15 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం ఫిర్యాదులు అందించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి నెలకు ఒకసారి ఫిర్యాదులపై మంత్రి కార్యాలయానికి రిపోర్టు వస్తుందన్నారు. ఫిర్యాదు చేసేందుకు email , మొబైల్ నెంబర్ ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఆర్టీఏలో మొబైల్ యాప్ రూపొందిస్తున్నామని చెప్పారు. 2018-19 లో రూ.7కోట్ల పర్మిట్ ఫీజులు వసూలు చేసామనీ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంటి ప్రతిపాదన లేదని చెప్పారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.